● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
దామెర: గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజాపాలన ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. దామెర మండలంలో రూ.1.26 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ల్యాదెళ్ల, దుర్గంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 10వేల మంది మహిళలు సభ్యులుగా చేరారని, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డెయిరీ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ల్యాదెళ్లలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించినట్లు, త్వరలో మినీ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని స్వాగతించకుండా, వ్యక్తిగత ఆరోపనలు చేయడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, సర్పంచ్‌లు బొంకూరి రవియాదవ్, దాసి శ్రీకాంత్, పొలెపాక శ్రీనివాస్, ఊరుగొండ ఉపసర్పంచ్ నంద్యాల శ్రవణ్ రెడ్డి, పీఆర్ డీఈ యుగేందర్, ఏఈ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దుబాసి రాజేందర్, జిల్లా కార్యదర్శి సదిరం పోశాలు, మాజీ అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, భిక్షపతి, రాజేందర్, కూనమల్ల రవీందర్, యూత్ నాయకులు నల్ల సుధాకర్, పొలెపాక ప్రశాంత్, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


