విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలి

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలి

విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు

విజయలక్ష్మీబాయి

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, సైట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మీబాయి జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓలను ఆదేశించారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ, అర్బన్‌ మండలాల విద్యాశాధికారులు, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జయశంకర్‌ బడిబాటలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు, ప్రీప్రైమరీలో విద్యార్థుల నమోదు ఎలా ఉంది, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, హనుమకొండ, కాజీపేట మండలాల పాఠశాలల్లో అల్పాహారం పంపిణీపై ఆరా తీశారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల నమోదు 33 వేలకుపైగా నమోదు లక్ష్యంగా ఉందని, ఇప్పటివరకు 28 వేల వరకు అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు. విద్యార్థుల వివరాలను యూడైస్‌లో పేర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10 వరకు వి ద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకునేలా కృషిచేయాలని విజయలక్ష్మిబాయి సూచించారు. ఎంఈఓలు నెహ్రూ, శ్రీనివాస్‌, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు మ హేశ్‌, మన్‌మోహన్‌, సునీత, సుమాదేవి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement