నాసిరకం, అధిక ధరలపై ఉక్కుపాదమే | - | Sakshi
Sakshi News home page

నాసిరకం, అధిక ధరలపై ఉక్కుపాదమే

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

నాసిరకం, అధిక ధరలపై ఉక్కుపాదమే

● జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయచంద్ర

పరకాల: అధిక ధరలకు, నాసిరకం ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించినా, ఒకదాంతో ఒకటి లింక్‌ పెట్టి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి విజయచంద్ర హెచ్చరించారు. పరకాలలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీ చేశారు. ఐదు దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. సరైన డాక్యుమెంట్లు, రికార్డులు సమర్పించకపోవవడంతో తదుపరి ఆదేశాల వచ్చే వరకు విక్రయాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. మరికొంతమంది దుకాణాదారులు నిబంధనల ప్రకారం స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ధరల పట్టికలు ప్రదర్శించకపోవడంతో యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 10 మంది వ్యవసాయాధికారులతో కలిసి జిల్లా వ్యవసాయాధికారి చేపట్టిన తనిఖీలతో స్థానిక వ్యాపారులు కలవరపడ్డారు. తనిఖీల్లో పరకాల ఏడీఏ ఆదిరెడ్డి, ఏఓ శ్రీనివాస్‌తో పాటు దామెర, ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, హసన్‌పర్తి, కాజీపేట, ఐనవోలు, ఎల్కతుర్తి మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement