జిల్లాలో భవిత కేంద్రాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో పనులు ప్రారంభించాం. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో నాలుగు భవిత కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. భవనాల నిర్మాణాలన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
– శ్రీనివాస్, డీఎస్‌ఓ
దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ
జిల్లాలోని దివ్యాంగులను గుర్తిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం పాఠశాల పరిధిలో ఉన్న భవనాల్లో వారికి శిక్షణ ఇస్తున్నాం. సాధారణ విద్యార్థుల్లా దివ్యాంగులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా స్కిల్స్ నేర్పిస్తున్నాం. తల్లిదండ్రులు భవిత కేంద్రాలను వినియోగించుకోవాలి.
– పాలకుర్తి మహేందర్,
ఐఈఆర్పీ, ఖానాపురం


