న్యూస్‌రీల్
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026
జంపన్న వాగులో భద్రతేది?
పుణ్యస్నానాల కోసం మేడారంలోని జంపన్నవాగులో దిగుతున్న భక్తులు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.
నర్సంపేటలో అత్యధికంగా 80 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ప్రస్తుతం అక్కడ భూగర్భజలాలు 5 నుంచి 6.5 మీటర్ల లోతులో ఉన్నప్పటికీ, వర్షాభావం కొనసాగితే రానున్న నెలల్లో నీటి మట్టం మరింత దిగజారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఖానాపురంలో 63 శాతం, గీసుగొండలో 70 శాతం వర్షపాతం లోటు నమోదవగా, అక్కడ భూగర్భజలాలు 7 నుంచి 9 మీటర్ల లోతులో ఉన్నాయి. వ్యవసాయ బోర్లపై ఆధారపడే రైతులకు ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైతే బోర్లు ఎండిపోవడం వంటి పరిస్థితులతో సాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వర్షపాతంలోటు భూగర్భజల పరిస్థితి
సాక్షి, వరంగల్: జిల్లాలో ప్రకృతి రెండు వైపులా పరీక్ష పెడుతోంది. ఒకవైపు జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. మరోవైపు అదే ప్రాంతాల్లో భూగర్భజల మట్టం కూడా గణనీయంగా దిగజారడం భవిష్యత్‌లో నీటి కొరతకు సంకేతాలిస్తోంది. వర్షాభావం, భూగర్భజలాల క్షీణత ఒకేసారి ఎదురవుతున్న ఈ శ్రీడబుల్ ఎఫెక్ట్‌శ్రీ జిల్లాలోని ఐదు మండలాలను ఆందోళనలోకి నెట్టింది. ఇప్పటికై నా విస్తారంగా వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జూలైలో కురవాల్సిన వర్షం కంటే అధికంగా వాన పడితేనే జనాల తిప్పలు తప్పనున్నాయి.
పర్వతగిరి, సంగెం మండలాల్లో
తీవ్ర ఆందోళన..
జిల్లాలోని పర్వతగిరి, సంగెం మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదముంది. ఒకవైపు పర్వతగిరిలో 77 శాతం వర్షపాతం లోటు ఉండగా, మరోవైపు అక్కడే భూగర్భజలాలు 11 మీటర్లకు పైగా దిగజారాయి. సంగెం మండలంలో 57 శాతం వర్షాభావం ఉండగా తీగరాజుపల్లిలో నీటి మట్టం 13.01 మీటర్ల లోతుకు చేరింది. ఈ రెండు ప్రాంతాల్లో జూలైలో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే బోర్లలో నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.
తాగునీటికీ ఇబ్బందే..


