పీహెచ్‌డీ రెన్యువల్‌ ఫీజు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ రెన్యువల్‌ ఫీజు తగ్గించాలి

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

కేయూ క్యాంపస్‌: పీహెచ్‌డీ రెన్యువల్‌ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్‌ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్‌ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్‌ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్‌, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్‌పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్‌, గుగులోత్‌ శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement