ఈ ఏడాది విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అధికారులు గ్రామాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి, ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నాం. కొందరు అడ్మిషన్లు తీసుకున్నా.. వారి పాఠశాలల నుంచి టీసీలు తీసుకురాకపోవడం, కొత్తవారు తరగతులకు హాజరుకాకపోవడంతో యూడైస్‌లో అప్‌డేట్ కాలేదు. ఇవేకాకుండా కొత్త విద్యార్థులను చేర్పించేందుకు అందరూ కృషి చేస్తున్నారు.
–బి.రంగయ్యనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి


