న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
స్మార్ట్ క్లాసులున్నా..
సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి
సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు.
సాక్షి, వరంగల్: ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల్లో జిల్లాలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. రూ.కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ తరగతి గదులు, నైపుణ్య ఆధారిత బోధన అందుబాటులోకి వచ్చినప్పటికీ విద్యార్థుల నమోదు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో 2024 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు మూడేళ్లలో మొత్తం 1,543 మంది విద్యార్థుల తగ్గుదల నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది.
గణనీయంగా పడిపోతున్న చేరికలు..
కొన్ని పీఎంశ్రీ పాఠశాలల్లో అడ్మిషన్ల చేరికలు గణనీయంగా పడిపోయాయి. టీఎస్‌ఎంఎస్ చెన్నారావుపేటలో 483 నుంచి 322కు, గీసుగొండలో 492 నుంచి 331కు, పర్వతగిరిలో 401 నుంచి 205కు, నెక్కొండలో 447 నుంచి 337కు తగ్గింది. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పర్వతగిరిలో 642 నుంచి 466కు, రాయపర్తిలో 675 నుంచి 478కు పడిపోయింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరేంద్రనగర్‌లో మాత్రం 735 నుంచి 718కు స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైంది.
తగ్గుదలకు కారణాలేంటంటే..
పీఎంశ్రీ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆధునిక ల్యాబ్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్రీడా సదుపాయాలు, సాంకేతిక ఆధారిత బోధన వంటి ప్రత్యేకతలు కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఈ సౌకర్యాలపై గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, ప్రైవేట్ పాఠశాలల ప్రచారం ప్రభావంతో ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు నమోదు కావడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు, ఇంగ్లిష్ మీడియంపై తల్లిదండ్రుల ఆసక్తి వంటి అంశాలు ప్రభుత్వ పాఠశాలల నమోదుపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఒకే కుటుంబంలోని పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించే ధోరణి కూడా పెరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో తగ్గుతున్న అడ్మిషన్లు
మూడేళ్లలో ఏకంగా 1,543 మంది విద్యార్థుల తగ్గుదల
2024–25లో 6,507 మంది ఉంటే ప్రస్తుతం 4,964 మాత్రమే
వందల సంఖ్యలో నమోదు తగ్గడంతో ఆందోళన
సకల సౌకర్యాలున్నా..పెరగని చేరికలు
చేరికలు తగ్గిన పాఠశాలలు
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ రాయపర్తి:
675 నుంచి 478
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పర్వతగిరి:
642 నుంచి 466
టీఎస్‌ఎంఎస్ సంగెం: 632 నుంచి 473
టీఎస్‌ఎంఎస్ చెన్నారావుపేట: 483 నుంచి 322
టీఎస్‌ఎంఎస్ పర్వతగిరి: 401 నుంచి 205


