నర్సంపేట: ఏ భూమిలో ఏ పంట పండుతుందో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి. రైతులు ఇష్టానుసారంగా ఎరువు వాడడంతో జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు భూసార పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఫలితాల ఆధారంగా ఎరువులు ఏ మోతా దో వాడాలనే విషయాలను రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తారు. తద్వారా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రతీ ఏడాది భూసార పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే, వాటి ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంతో రైతులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు మట్టి నమూనా ఫలితాలను అందుకోకపోవడంతో ఇష్టానుసారంగా ఎరువులు వాడడం వల్ల ప్రతీకూల ప రిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు అధికారులు పంపారు. ఫలితాలు రాకపోవడానికి ఏ చేయాలో తెలియక రైతులు తమ పని తాము చేసుకుపోతున్నారు.
ప్రభుత్వ విధానం ఇది..
పంటల సాగు భూముల్లో మట్టి నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాల్సి ఉంది. ఇందుకోసం రైతుల వారీగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రక్రియ కాస్త మందగించింది. ఇప్పుడిప్పుడే కొన్నిచోట్ల గ్రామాల వ్య వసాయ విస్తరణాధికారులు మట్టి నమూనా ఫలి తాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. దీంతో ఫలితాల వెల్ల డి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో సేకరించిన నమూనాల ఫలితాలు ఇప్పటికీ అందలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలో 1,830 మట్టి న మూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా, కేవలం 295 ఫలితాలు మాత్రమే అందాయని అధికారుల ద్వారా తెలిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హనుమకొండలో ఒకటే ల్యాబ్ ఉండడంతో భూసార పరీ క్ష ల ఫలితాలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో మట్టి నమూనాల సేకరణ 1,830
ఫలితాలు వచ్చినవి
295
భూసార పరీక్షల కోసం
మట్టి నమూనాల సేకరణ
ఫలితాల వెల్లడిలో జాప్యం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
రైతులకు తప్పని తిప్పలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మర్రి నర్సింగం. ఇతనిది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామం. గతంలో రెండుసార్లు భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాడు. ఏడాది గడిచినా ఫలితాలు అందలేదు. 20రోజుల క్రితం కూడా వ్యవసాయ అధికారులు వచ్చి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినా నేటికీ ఫలితం రాలేదు. భూసార పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయనడానికి ఇది ఓ నిదర్శనం.


