ఒక్కటిగా ఆలోచిస్తేనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఒక్కటిగా ఆలోచిస్తేనే అభివృద్ధి

Jul 1 2026 1:40 AM | Updated on Jul 1 2026 1:40 AM

జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్‌

అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు చిన్నస్వామి

గీసుకొండ: కులమత భేదాలను మర్చిపోయి ‘మేము–మీరు’ అనే భావనను విడిచిపెట్టి అందరూ ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు నమిండ్ల చిన్నస్వామి తెలిపారు. మంగళవారం మండలంలోని బొడ్డు చింతలపల్లిలో సర్పంచ్‌ పోగుల వనిత అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ/ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులతో మాట్లాడి వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ ఆర్‌ఐ మధు చంద్ర, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేదాసి మోహన్‌, మెడికల్‌ ఆఫీసర్‌ సుధా, ఉప సర్పంచ్‌ నెరేళ్ల శైలజ, పంచాయతీ సెక్రటరీ ముక్కెర ఆనంద్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement