వరంగల్ అర్బన్ : వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జీడబ్ల్యూఎంసీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో స్వనిధి మహోత్సవ్–2026 కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులను సన్మానించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎల్‌డీఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డీఎంసీ రజిత రాణి, రమేష్ పాల్గొన్నారు.
పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు.
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్


