దామెర: వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జల సంరక్షణ నోడల్ ఆఫీసర్ డి.చైతన్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకుడుగుంతల ఏర్పాటుతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. ఎగువ నుంచి దిగువకు నీరు ప్రవహించే స్ధలాలను గుర్తించి పాండ్లను నిర్మించుకోవాలన్నారు. నీటి వనరుల పెంపు కోసం ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఏపీఓ శారద, ఈసీ రాజేశ్, టీఏలు సురేందర్, ప్రిసిల్లా, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.


