గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యం

Jun 30 2026 1:24 AM | Updated on Jun 30 2026 1:24 AM

గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యం

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్‌: గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మండలంలోని ఎల్కుర్తి, జానకీపురం గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో 26 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌, 39 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఏనాడూ ఒక్క పనిచేయని సన్నాసులు చాలా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచులు సుధాకర్‌, జగన్‌ మోహన్‌రెడ్డి, మాచర్ల జ్యోతి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్‌ భావ్‌సింగ్‌, ఎంపీడీఓ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement