అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకు ఆదర్శం

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

ఘనంగా 30వ మహాజన సభ

కాశిబుగ్గ: తెలంగాణలో ఆదర్శ బ్యాంకుగా అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకు సేవలు అందిస్తున్నామని ఆ బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్‌ తిలక్‌ రోడ్డులోని కేవీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బ్యాంక్‌ 30వ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బ్యాంకు మంచి లాభాలతో నడుస్తోందని, వచ్చే సంవత్సరం నుంచి హైదరాబాద్‌, రంగా రెడ్డి జిల్లాల్లో శాఖలను విస్తరించనున్నట్లు తెలిపా రు. డిజటల్‌ సేవలను విస్తృతంగా అందిస్తున్నామని, సామాజిక బాధ్యతగా కేంద్రం బీమా సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ ఆపరేషన్‌ చే యించుకున్న వారికి వైద్య సాయం కింద రూ. 25,116 అందిస్తున్నట్లు, ఇక నుంచి ఈ డబ్బులను రూ.40 వేలకు పెంచుతామన్నారు. బ్యాంకు సేవలను జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరా రు. సమావేశంలో బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ తోట జగన్నాథం, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement