నేటి కేటీఆర్‌ పర్యటన వాయిదా | - | Sakshi
Sakshi News home page

నేటి కేటీఆర్‌ పర్యటన వాయిదా

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

హన్మకొండ: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం వరంగల్‌ పర్యటన వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండ హంటర్‌ రోడ్డులోని మైదానంలో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ తూర్పు కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కేటీఆర్‌ జ్వరంతో బాధపడుతుండడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఎప్పుడు జరిగేది తర్వాత తెలుపుతామని నరేందర్‌ తెలిపారు.

తాపీమేసీ్త్రగా మారిన పాట్నా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి

సంగెం: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుమా.. చూసి మోసపోకుమా అనే సినీ గేయాన్ని గుర్తుకు వచ్చేలా పాట్నా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి లింగాల నర్సింహరెడ్డి ఆయన స్వగ్రామం సంగెం మండలం గవిచర్లలో తాపీమేస్త్రిగా మారారు. గ్రామంలోని తీగల చెరువు మత్తడిని 15 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం స్థానిక రైతులు సంబంధిత ఐబీ అధికారులకు తెలిపారు. దీని మరమ్మతులకు నిధులు లేవని, ప్రతిపాదనలు పంపామని నిధులు మంజూరైన తర్వాత పనులు చేస్తామని చెప్పడంతో వానలు వస్తే చెరువులో నీరు నిల్వ ఉండదని రిటైర్డ్‌ జడ్జి స్థానిక రైతులతో కలిసి కూల్చిన మత్తడిని తన సొంత ఖర్చులతో స్వయంగా సరిచేసి ఆది వారం పునరుద్ధరించారు. ఆయన వెంట రైతులు లింగాల నవీన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సామల మధు, బాషిపాక రాజు ఉన్నారు.

పిల్లల వార్డులో

పాము ప్రత్యక్షం

సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో

భయం.. భయం

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పాముల భయం నెలకొంది. తాజాగా శనివారం ఎస్‌ఎన్‌సీయూ పిల్లల వార్డులోని సింక్‌ వరకు ఓ పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. పసికందులు ఉండే ఫొటోథెరపి రూంలోకి పాము వచ్చి బల్లిని నోటకరుచుకోవడంతో సిబ్బందితోపాటు తల్లులు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం కూడా ఓ పాము వచ్చిందంటూ పేషంట్ల అటెండెంట్లు తెలిపారు. ఇలా పాములు వస్తే మా బిడ్డలు, పసికందుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. పాముల విషయంపై ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ డాక్టర్‌ సృజన్‌ను వివరణగా కోరగా... పాము వార్డులోకి వచ్చినట్లు తెలిసిందని, అప్పుడు తాను కలెక్టరేట్‌లో ఉన్నానని చెప్పారు. అయినా వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించామని తెలిపారు. పాములు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ క మిషనర్‌ ఇసంపెల్లి జోనా ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement