● టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
రంజిత్‌కుమార్
కాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. శాసీ్త్రయ అంశాలను సిలబస్ నుంచి తొలగించడం, మూడ విశ్వాసాలను పెంపొందించే విధంగా, విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా ఉన్న నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ2020)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్‌ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు నామోజు శ్రీనివాస్, కోశాధికారి ఎస్‌ఏ రావూఫ్ తదితరలు పాల్గొన్నారు.


