ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పీవీ | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పీవీ

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

వంగరలో ఘనంగా పీవీ జయంతి

భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధానమంత్రి, ‘భారతరత్న’ పీవీ.నరసింహారావు జయంతి వేడుకలను ఆదివారం వంగరలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, పీవీ కుటుంబ సభ్యులు పీవీ మదన్‌మోహన్‌ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు పీవీ.. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి సీఐ పులి రమేశ్‌, ఎస్‌ఐ దివ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పి.రాజిరెడ్డి, ఎల్కతుర్తి మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ బొక్కల స్రవంతి, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెంపల్లి ఐలయ్య, జిల్లా కార్యదర్శి ఆదరి రవీందర్‌ యాదవ్‌, ముల్కనూరు సర్పంచ్‌ జాలి ప్రమోద్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు చిదురాల స్వరూప, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కుల అనిల్‌ యాదవ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement