న్యూస్‌రీల్
శాయంపేట: ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నాలికె భిక్షపతి. శాయంపేట మండల కేంద్రానికి చెందిన ఈయనకు సొంతగా రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని 15 రోజుల క్రితం కురిసిన తొలకరి జల్లులకు మొత్తం 8 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాడు. వర్షాలు కురవకపోవడంతో శుక్రవారం పత్తి విత్తనాలకు స్ప్రింక్లర్లతో నీటిని వెదజల్లాడు. ట్రాక్టర్‌తో బోజ, పల్టర్ కొట్టడానికి, దుక్కి దున్నడానికి, విత్తనాలకు మొత్తం రూ.45 వేలు ఖర్చయ్యిందని వాపోయాడు. వర్షం లేక విత్తనాలు ఎండిపోతున్నట్లు చెప్పాడు. ఈ పరిస్థితి ఒక్క నాలికె భిక్షపతిది మాత్రమే కాదు.. జిల్లాలోని అనేక మంది రైతులది.


