బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్,
రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
హన్మకొండ: రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని వేద బాంక్వెట్ హాల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని సమదృష్టితో చూస్తోందన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన కొత్తగా చేస్తున్నదేమి కాదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ముస్లింలు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలని సీఎం రేవంత్ అంటున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనతోనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని, 12 ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో రాష్ట్రానికి కేంద్రం రూ.130 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 29న హనుమకొండలోని అశోక హోటల్‌లో జరిగే ఆదివాసీ గిరిజన సదస్సు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా శాల మైదానంలో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని లక్ష్మణ్ వివరించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతో ష్‌రెడ్డి, గంట రవికుమార్, నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, గువ్వల బాలరాజు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వన్నాల వెంకటరమణ ఉన్నారు.


