‘సర్‌’ పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పారదర్శకంగా చేపట్టాలి

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

పరకాల ఆర్డీఓ వెంకన్న

సంగెం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) పారదర్శకంగా చేపట్టాలని పరకాల ఆర్డీఓ డీఎస్‌. వెంకన్న బీఎల్‌ఓలను ఆదేశించారు. మండల పరిధిలోని కాపులకనిపర్తిలో సర్‌ ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ఫారాల అందజేత, సర్వే చేస్తున్న వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాట్లకు తావులేకుండా ఎన్యూమరేషన్‌ ఫారాలను పూరించాలన్నారు. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించవద్దని అధికారులకు సూచించారు. అనంతరం బీఎల్‌ఓలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంగెం తహసీల్దార్‌ గనిపాక రాజ్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ నరేందర్‌, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement