కరుణించని వరుణుడు | - | Sakshi
Sakshi News home page

కరుణించని వరుణుడు

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

– 8లోu శనీశ్వరుడికి పూజలు డీఈఈ సెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన రైతులు దరఖాస్తు చేసుకోవాలి కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026

హన్మకొండ కల్చరల్‌: శనిత్రయోదశిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో శనీశ్వర ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు.

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని డైట్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ప్రవేశాలకు ఈనెల 29న మూడోదశ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు హనుమకొండలోని ప్రభుత్వ డైట్‌ (జిల్లా విద్యాశిక్షణ సంస్థ) ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌ బి.రంగయ్యనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, ర్యాంకు కార్డు, హాల్‌టికెట్‌, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమో, నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, టీసీ, ఎన్‌సీసీ, క్రీడలు, పీఎస్‌ ధ్రువపత్రాలు తీసుకొని హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకున్న అభ్యర్థులు ఈనెల 30న ఆప్షన్లు ఇచ్చుకోవాలని, జూలై 4న మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, 9న కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని ఆయన కోరారు.

హన్మకొండ: నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు జూలై ఐదో తేదీలోపు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి వి.విజయచంద్ర కోరారు. ఈ నెల 15వ తేదీలోపు సీసీఎల్‌ఎ ద్వారా భూభారతి పోర్టల్‌ నమోదైన రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సీజన్‌లో రైతు భరోసా సాయం అందని రైతులు తమ బ్యాంకు ఖాతాలు సరి చేసుకుని, ఫోన్‌ నంబర్‌గా తప్పుగా నమోదైన రైతులు, ఒకటి కంటే ఎక్కువ ఆధార్‌ నంబర్లు అనుసంధానమైన రైతులు వెంటనే సవరణలు చేసుకోవాలని, ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ విధిగా చేయించుకోవాలని కోరారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్‌ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సి.రామాజంనేయులు, ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కై లాశ్‌యాదవ్‌, లీగల్‌ అడ్వైజర్లు సత్యనారాయణ, తిరుమల, విరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా బండారి సంతోష్‌, జనరల్‌ సెక్రటరీగా సిరిగిరి తిరుపతి, కోశాధికారిగా సాదినేని శ్యాంకుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా సీహెచ్‌ సుప్రియ, జాయింట్‌ సెక్రటరీగా ఎస్‌.సాంబశివ, కార్యవర్గ సభ్యులుగా పి.దినేశ్‌తేజ, పి.గణేశ్‌తేజ ఎన్నికయ్యారు.

సాక్షి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17 జిల్లాలు వర్షపాతం లోటుతో ఉండగా ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి. వర్షాధార వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నా, సరిపడా వానలు లేక సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్‌ 1 నుంచి 24 వరకు రాష్ట్రంలో సాధారణంగా 101.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 84.9 మిల్లీమీటర్లే కురిసింది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ స్థాయిలో వర్షాలు కురిస్తేనే సాగు పూర్తి స్థాయిలో ఊపందుకునే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

నత్తనడకన ‘సాగు’తోంది..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, కందులు వంటి పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. సాధారణంగా జూన్‌ రెండో వారానికి రైతులు విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఆశించిన వర్షాలు లేకపోవడంతో చాలామంది రైతులు విత్తనాలు వేసే పనులను వాయిదా వేశారు. చిన్నపాటి వర్షానికి కొందరు రైతులు విత్తనాలు నాటినా భూమిలో తేమ లేకపోవడంతో అవి వాడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సంమృద్ధిగా కురిస్తే మళ్లీ విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి నెలకొనడంతో పెట్టుబడి ఖర్చు తడిసిమోపెడవుతుందని రైతులు వాపోతున్నారు. వచ్చే రెండు వారాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే సాగు గాడిలో పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా తగ్గిన వర్షపాతం

ఇప్పటికే 58శాతం లోటు..

సాగుపై తీవ్ర ప్రభావం

వాడిపోతున్న పత్తి విత్తనాలు

ఎదురుచూస్తున్న అన్నదాతలు

ఈవీ బస్‌డిపో నిర్మాణానికి

ఆర్డీఓ స్థలపరిశీలన

క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు కార్యాచరణ

అంతర్జాతీయ స్థాయిలో ఇండస్ట్రీ ఏర్పాటు

ఆర్డీఓ కార్యాలయం తరలింపునకు ప్రతిపాదనలు

మినీ ట్యాంక్‌బండ్‌గా పెద్ద చెరువు

అభివృద్ధికి చర్యలు

ఫొటోలో కనిపిస్తున్న రైతు సంగెం మండల కేంద్రానికి చెందిన ఉండిల మల్లికార్జున్‌. ఇతనికి 5 ఎకరాల భూమి ఉంది. కొద్దిపాటి వర్షానికి ట్రాక్టర్‌తో దుక్కి దున్నుంచి పత్తి గింజలు విత్తాడు. దుక్కి చేసినందుకు ఖర్చు కాకుండా ఎకరం అచ్చు తోలడానికి రూ.1,000, పత్తి గింజలకు రూ.1,500, నాటడానికి రూ.1.200 ఎకరానికి రూ.3,700 ఖర్చు అయింది. ఈ లెక్కన 5 ఎకరాలకు రూ.18,500 ఖర్చయింది. చినుకు జాడ లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తడకపోవడంతో మరోసారి విత్తనాలు నాటాలంటే మరో రూ.18,500 పెట్టుబడి పెట్టాల్సి ఉందని ఆందోళన చెందుతున్నాడు.

ఈ ఫొటోలోని రైతుపేరు నల్ల రాజిరెడ్డి, దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామానికి చెందిన ఇతను మూడు ఎకరాల వ్యవసాయ భూమిని రూ.లక్షకు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కురిసిన చిన్నపాటి వర్షానికి రెండు సార్లు పత్తి విత్తనాలు వేశాడు. ఆపైన వర్షం ముఖం చాటేసింది. పదను సరిపోక మొలక పైకి రాలేక విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. దీంతో మూడోసారి విత్తనాలు కొనాలంటే మళ్లీ డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 30 తర్వాత వర్షాలు కురిసినా.. పత్తి విత్తనాలు వేస్తే పంటకాలం మారిపోతుందని పంట చేతికొచ్చే సమయంలో గులాబీ రంగు పురుగు ఆశించి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నాడు. ఇక పత్తి పెట్టడం మానుకోవడమే ఉత్తమమని భావిస్తున్నాడు.

అత్యధిక లోటు వర్షపాతం: హనుమకొండ –96 శాతం, ఎల్కతుర్తి –89శాతం, కాజీపేట –89 శాతం, ఆత్మకూరు –87 శాతం, ఐనవోలు –83 శాతం, హసన్‌పర్తి –82 శాతం, దామెర –81 శాతం, శాయంపేట –71 శాతం, ధర్మసాగర్‌ –69 శాతం, వేలేరు –68 శాతం, కమలాపూర్‌ –65 శాతం, నడికూడ –64 శాతం

లోటు వర్షపాతం : భీమదేవరపల్లి –58 శాతం, పరకాల –54 శాతం,

అత్యధిక లోటు వర్షపాతం: వరంగల్‌ –84 శాతం, గీసుకొండ –72 శాతం, ఖిలావరంగల్‌ –96 శాతం, సంగెం –61 శాతం, పర్వతగిరి –84 శాతం, నెక్కొండ –75 శాతం, చెన్నారావుపేట –70 శాతం, నర్సంపేట –80 శాతం

లోటు వర్షపాతం: ఖానాపురం–56 శాతం, నల్లబెల్లి –30 శాతం, రాయపర్తి –23 శాతం

సాధారణ వర్షపాతం: వర్ధన్నపేట –17 శాతం, దుగ్గొండి –రెండు శాతం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement