న్యూశాయంపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి బి.బాలమాయాదేవి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేసిన 10 థీమ్‌లకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంబంధిత శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. వివిధ శాఖల వారీగా సాధించిన పురోగతితో పాటు లక్ష్యాల సాధన, ఎదురవుతున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమా, ఉమారాణిలతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి,
ప్రత్యేక అధికారి బాలమాయాదేవి


