డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్‌ జోన్‌ పోలీసులు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్‌ను కలిసి సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌, కుడా చైర్మన్‌ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement