న్యూస్‌రీల్
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభు త్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల అవసరం ఉంది. పలుచోట్ల పాఠశాలల్లో మిగులు టీచర్లు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల వర్క్ అడ్జెస్ట్‌మెంట్ (పని సర్దుబాటు) చేయనున్నారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు, సబ్జెక్టుల వారీగా టీచర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వర్క్ అడ్జెస్‌మెంట్ చేశారు. అవసరం ఉన్న పాఠశాలలకు విద్యార్థుల నమోదు తక్కువగా ఉండగా.. మిగులు ఉన్న 158 మంది టీచర్లను అడ్జెస్ట్‌మెంట్‌చేశారు. ఆ తర్వాత జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సుమారు 30 మంది టీచర్లను అకడమిక్ ఫ్యానల్ తనిఖీ బృందాలుగా నియమించారు. ఆయా టీచర్ల స్థానంలో మరో 30 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారు. మొత్తంగా 188 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారు. తనిఖీ బృందాల్లోని 30 మంది టీచర్లు ఈ విద్యాసంవత్సరం ప్రస్తుతం తిరిగి తమ పాఠశాలల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 158 మంది టీచర్లు గత విద్యాసంవత్సరం ఏ పాఠశాలల్లోనైతే వర్క్‌అడ్జెస్ట్‌మెంట్ కింద పనిచేశారో ఆయా పాఠశాలల్లోనే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని యథావిధిగా ఆయా పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు.
29న ఎంఈఓలతో డీఈఓ సమావేశం..
జిల్లాల్లో అవసరం మేరకు పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్‌మెంటు చేయాలని ఆదేశించారు. దీంతో హనుమకొండ జిల్లాలో ఏ పాఠశాలల్లో ఎంత మంది టీచర్లు ఉద్యోగ విరమణ పొందారు, దీర్ఘకాలిక సెలవుల్లో ఏ మండలంలో ఎంతమంది ఉన్నారనేది జిల్లా విద్యాశాఖ 14 మండలాల ఎంఈఓల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈమేరకు ఎక్కడెక్కడ ఇంకా మిగులు టీచర్లు కూడా ఉన్నారని తెలుసుకుంటున్నారు. టీచర్ల వర్క్‌అడ్జెస్ట్‌మెంట్‌పై ఈనెల 29 హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఎంఈఓల సమావేశం నిర్వహించనున్నారు.
జూన్ 20 వరకు నమోదు ఆధారంగా..
పాఠశాలల వారీగా ఈనెల 20వరకు విద్యార్థుల న మోదు ఆధారంగా, అలాగే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల అవసరాలను అంచనా వేసి వర్క్‌అడ్జెస్ట్‌మెంట్ చేయాలి. ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి స్థానంతోపాటు త్వరలోనే మళ్లీ పాఠశాలల తనిఖీ బృందాలుగా కూడా మరో 39 మంది టీచర్లను నియమించన్నారు. దీంతో వారి స్థానంలో కూడా టీచర్ల సర్దుబాటు చేయాల్సినఅవసరం ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచర్లు తక్కువగా ఉండడం, విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మిగులు టీచర్లను గుర్తించి అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్‌అడ్జెస్ట్‌మెంట్ చేయాలి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, కొన్ని హైస్కూళ్లలో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇప్పటికే పలువురు హెచ్‌ఎంలు తమకు సబ్జెక్టు టీచర్లు అవసరం ఉన్నారని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. జిల్లాలో 36 ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా.. అందులో ఈ విద్యాసంవత్సరం ఒక పాఠశాల మాత్రమే తెరుచుకుంది.
రిటైర్డ్, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్‌మెంట్
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
ఉత్తర్వులతో అధికారుల కసరత్తు
గత విద్యాసంవత్సరం హనుమకొండ జిలాల్లో 188 మంది సర్దుబాటు
విద్యార్థుల సంఖ్య ఇలా..
గతవిద్యాసంవత్సరం 475 పాఠశాలల్లో 33,982 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు వెళ్లిపోయారు. ఈనెల 23 వరకు 26,408 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై వరకు ఈసంఖ్య పెరగనుందని భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టీచర్ల సర్దుబాటు ఉంటుంది.
టీచర్ల సంఖ్య ఇలా..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,708 టీచర్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 2,256 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 452 టీచర్ల పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి.


