వ్యవసాయ భూమిలో బంగారం లభ్యం? | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ భూమిలో బంగారం లభ్యం?

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

కోపాకులపాడులో కూలీలకు దొరికిన పుత్తడి

50 తులాల హారం, పుస్తెలు,

పుస్తెల్లోని గుండ్లు ఉన్నట్లు ప్రచారం

చెన్నారావుపేట: మండల కేంద్రంలోని కోపాకుల చెరువు సమీపంలోని కోపాకుల పాడు వ్యవసాయ భూముల్లో బుధవారం కూలీ పనులు చేస్తున్న వారికి బంగారం దొరికినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కోపాకులపాడులో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామం ఉన్న ప్రాంతం ప్రస్తుతం వ్యవసాయ భూములుగా మారింది. చెన్నారావుపేట, ఈర్యాతండాలకు చెందిన ప్రజలు అక్కడ చాలాఏళ్ల నుండి వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో దేవతా విగ్రహాలు లభించాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కోపాకుల పాడులోని ఓ రైతు భూమిని కౌలుకు తీసుకున్న రైతు ట్రాక్టర్‌తో లోతు దుక్కిదున్ని పత్తి విత్తనాలు వేశాడు. పత్తి మొలకల్లో కూలీలు గడ్డి కలుస్తుండగా.. బంగారు కంఠహారం, పుస్తెలు, పుస్తెల్లో ఉండే గుండు దొరికినట్లు గ్రామంలో గుసగుసలు వినిస్తున్నాయి. ఆ హారం 50 తులాల వరకు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఇంతా జరిగినా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.

దేవతామూర్తులకు చెందిన నగలేనా..?

కోపాకులపాడు నలువైపులా వ్యవసాయ భూముల్లో శిథిలమైన దేవాలయాలు ఉన్నాయి. శివాల యం, హనుమాన్‌ దేవాలయం, మైసమ్మ తదితర ఆలయాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం వ్యవసా య భూముల్లో కూలీలకు దొరికిన బంగారం నగలు దేవతామూర్తులకు అలంకరించే విధంగానే ఉన్నట్లు సమాచారం.

కూలీలకు దొరికినట్లుగా భావిస్తున్న బంగారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement