ఖిలా వరంగల్: వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను గురువారం డీఎంహెచ్‌ఓ సాంబశివరావు పరిశీలించారు. పనులు నాణ్యతగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టకు సూచించారు. అనంతరం యూపీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలను సమీక్షిచారు. రోగులకు అందుతున్న సేవలు, వైద్య రికార్డులు, ఔషధాల లభ్యత, మాతా శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, యూ వీన్ ఎన్సీడీ, టీకా కార్యక్రమాలు తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూ శాయంపేట: జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం(ఎన్‌ఎస్‌ఎపీ), జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ యజమాని మరణించి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం రూ.20వేలు అంజేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు, మరణ, ఆదాయ, కుటుంబ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫొటోతో మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


