నల్లబెల్లి: తీసుకున్న రుణం చెల్లించలేదని నారక్కపేటలో రైతు భూమిని డీసీసీబీ అధికారులు గురువారం వేలం వేశారు. అధికారుల కథనం ప్రకారం.. నారక్కపేట గ్రామానికి చెందిన వరికెల రాంబాబు నర్సంపేట డీసీసీ బ్యాంకు బ్రాంచ్‌లో రూ.8 లక్షల రుణం తీసుకున్నాడు. నాలుగేళ్లుగా కిస్తీలు చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో భూమిని వేలం వేశారు. అదేగ్రామానికి చెందిన గుండెకారి శంకర్ ఎకరం భూమిని రూ.12.80 లక్షలకు సొంతం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ విజయ కుమారి, బ్యాంకు మేనేజర్లు జయప్రకాశ్, యాకూబ్‌పాషా, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


