కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం రూసా 02 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. హ్యాండ్స్ ఆన్ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మంరింతగా మెరుగుపుడుతాయన్నారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్లు ఎన్.రమణ, కె.భిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


