హసన్‌పర్తి: వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గృహవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు అఽధికారులు గుర్తించారు. 73 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ఇందు శేఖర్, బోగేస్ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో డీటీలు భద్రునాయక్, వేణుగోపాల్, ఎఫ్‌ఐ సదానందం పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్లను సీజ్‌చేసిన అధికారులు


