గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాకలోని గోల్డెన్ విల్లాలో గురువారం ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారద హాజరయ్యారు. నగరంలోని 15, 16, 17 డివిజన్లు, గీసుకొండ రూరల్ మండలంలోని ముస్లింలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావానికి, మత సామరస్యానికి ప్రతీకగా పండుగను జరుపుకోవాలని సూచించారు. వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎండీ జానీ, ముస్లింలు పాల్గొన్నారు.
ముగిసిన ఓరియంటేషన్
కాళోజీ సెంటర్: జిల్లాలో ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా ఈనెల 6న ప్రారంభమైన ఓరియంటేషన్ ప్రోగ్రాం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. మిషన్ తేజస్ యాప్ ద్వారా విద్యార్థులు ఓరియంటేషన్ ప్రోగ్రాంను వీక్షించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి గారె కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి యాకూబ్‌రెడ్డి పాల్గొన్నారు.
242 మంది
విద్యార్థుల గైర్హాజరు
కాళోజీ సెంటర్: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షకు 242 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 5,544 మంది జనరల్ విద్యార్థులకు 5,369 మంది, 767 మంది ఒకేషనల్ విద్యార్థులకు 700 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
క్రీడాపాఠశాలల్లో
ప్రవేశాలకు 16న పోటీలు
నర్సంపేట: క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 16న నర్సంపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాపోటీలు ఉంటాయని ఎంఈఓ కొర్ర సారయ్య తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆధార్, స్టడీ, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ప్రతిభ ఆధారంగా క్రీడా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పొందుతారని తెలిపారు.
కిడ్నీ రోగులకు అవగాహన
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ సుధీర్, ఆర్‌ఎంఓ డాక్టర్ కల్యాణి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకుంటూ కిడ్నీ ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం కిడ్నీ రోగులకు అవగాహన కల్పించారు. ఆస్పత్రి హెడ్ సిస్టర్, నర్సింగ్ ఆఫీసర్, డయాలసిస్ సెంటర్ మేనేజర్ వినయ్, టెక్నీషియన్లు, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.
హైర్ బస్సుల్లో
బ్యాటరీలు చోరీ
నర్సంపేట రూరల్: రెండు హైర్ బస్సుల్లో బ్యాటరీలు చోరీ అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని హైర్ బస్సులను బుధవారం రాత్రి వరంగల్ రోడ్డులో పార్కింగ్ చేసి ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తులు రెండు బస్సులకు సంబంధించిన నాలుగు బ్యాటరీలు, టర్నల్స్ అపహరించాయారు. గురువారం ఉదయం డ్రైవర్లు బస్సులను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదు. అనుమానం వచ్చి చూడగా బస్సుల్లో బ్యాటరీలు, టర్నల్స్ కనిపించలేదు. దీంతో బస్సుల యజమానులు నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాటి విలువ సుమారు రూ. 60వేల వరకు ఉంటుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


