మంచి మార్కులు తెచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మంచి మార్కులు తెచ్చుకోవాలి

Mar 12 2026 7:48 AM | Updated on Mar 12 2026 7:48 AM

మంత్రులను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ ఆర్థిక స్వేచ్ఛతో మహిళల అభివృద్ధి

సంగెం: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కలెక్టర్‌ సత్యశారద పదో తరగతి విద్యార్థులకు సూచించారు. సంగెం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను బుధవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలి. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన వారు.. వారి తల్లిదండ్రులతో సహా తన కార్యాలయాలనికి వచ్చి బిర్యాని విందు స్వీకరించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ సాంబశిరావును ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ రవీందర్‌, హెచ్‌ఎం రాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను బుధవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్‌ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు ఉన్నారు.

కొమ్మాల జాతర ఆదాయం రూ. 21.44 లక్షలు

గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా పలు రకాల సేవల ద్వారా రూ.21,44,433 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ప్రసాద్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ వీరాటి రవీందర్‌రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. బుధవారం హుండీల లెక్కింపు చేపట్టగా గతనెల 27 నుంచి ఈనెల 11 వరకు శీఘ్ర, ప్రత్యేక దర్శనాలు, కేశ ఖండనం, అష్టోత్తర సేవలు, స్వామివారి కల్యాణ కానుకలు, హుండీ ద్వారా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. కొమ్మాల సర్పంచ్‌ కన్నెబోయిన యమున, నాయకులు ప్రవీణ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉగాది వరకు జాతర సాగుతుందని వారు తెలిపారు.

హన్మకొండ: ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే మహిళలు మరింత అభివృద్ధి సాధించవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, టైలరింగ్‌, బ్యూటిషియన్‌ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో బుధవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలు అందిపుచ్చుకుని సాధికారత సాధించాలన్నారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్‌ సిస్టర్‌ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యాం సుందర్‌, సైబర్‌ క్రైం ఇన్స్‌పెక్టర్‌ అశోక్‌కుమార్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ నాగవాణి, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్‌, బత్తుల కరుణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement