న్యూస్‌రీల్
వరంగల్
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
పరీక్షల వేళ.. ఆరోగ్యం భద్రం
పదో తరగతి పరీక్షల సమయం ముంచుకొస్తోంది. పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లల ఆహార నియమాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.
ఇన్సూరెన్స్,
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల లైసెన్స్ ‘రెన్యువల్’ అంశం రచ్చరచ్చ చేస్తోంది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో పలు ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో డీఎంహెచ్‌ఓ స్థాయిలోనే ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ అంశం ఉండేది. రెండేళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ ప్రకారం కలెక్టర్లు పరిశీలించి అనుమతులిస్తున్నారు. రెండేళ్లలో ఒకేసారి ఈ ఆస్పత్రుల రెన్యువల్‌పై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష చేయగా సరాసరిన ఐదు ఆస్పత్రులకు మాత్రమే రెన్యువల్ క్లియర్ అయ్యింది. ఇంకా 40కిపైగా ఆస్పత్రులు, క్లినిక్‌లు లైసెన్స్ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీనివల్ల ప్రజలతోపాటు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆ ఆస్పత్రి నిర్వాహకులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 20 పడకలలోపువే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
ఎవరెవరికీ నష్టం కలుగుతుందంటే...
● ఆయా వైద్యులపై ఉన్న నమ్మకంతో ఆ ఆస్పత్రులకు వచ్చి వైద్య పరీక్షలు, సర్జరీలు, ఆపరేషన్లు చేయించుకుంటున్న రోగులు ఆర్థిక సాయం కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు.ఆ సమయంలో ఈ ఆస్పత్రులకు రెన్యువ ల్ లేకపోవడంతో తిరస్కరణకు గురవుతున్నాయి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ ఆస్పత్రుల్లో బిల్లులతో దరఖాస్తు చేస్తే అక్కడ కూడా రిజెక్ట్ అవుతోంది. దీంతో రూ.వేలు, రూ.లక్షల్లో రోగులు నష్టపోతున్నారు.
● ఇలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఆయా ఆస్పత్రుల నిర్వహణ భారం అధికమై యాజామాన్యాలు అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల వైద్యులు, నర్సరీలు, ఫార్మసిస్టులకు కూడా సకాలంలో జీతాలు రావడం లేదు.
కలెక్టర్ చొరవచూపితేనే..
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా నమోదు చేసుకుని నిర్దిష్ట కాల వ్యవధిలో తమ లైసెన్స్‌లు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ కోసం ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, భవన అనుమతులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ అనుమతి వంటి పలు పత్రాలు సమర్పించాల్సి రావడంతో ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇవి సమర్పించాక కూడా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆలస్యం కావడమే అసలుకే మోసం వస్తోంది. అన్ని విభాగాల నుంచి కావాల్సిన అనుమతి పత్రాలు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో రెన్యువల్ అప్లికేషన్ పూర్తిగా నింపి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసినా అడుగు ముందుకు పడడం లేదు. ఈ దరఖాస్తుతో బిల్డింగ్ పర్మిషన్ లెటర్, అద్దెకు అయితే ఓనర్ నుంచి లీజు సర్టిఫికెట్, ఓనర్ ఆఫ్ ది హాస్పిటల్, విజిటింగ్ డాక్టర్స్ అగ్రిమెంట్ కాపీ, ఫైర్ సేఫ్టీ, క్వాలిఫైడ్ స్టాఫ్ (నర్సులు, మత్తుడాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్), ఫార్మసి సర్టిఫికెట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి బయో మెడికల్ వెస్ట్ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ సమర్పించారు. అయినా 40కిపైగా ఆస్పత్రులు, క్లినిక్‌ల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు ఏడాదిన్నరకుపైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కావాలనే డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో ఆలస్యం చేస్తున్నారా లేదా కలెక్టర్‌కు సమయం లేక నిర్లక్ష్యం అవుతోందా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, పోలీసు అధికారులు, ఐఎంఏ అధ్యక్షుడు లేదా సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ఆయా ఆస్పత్రుల డాక్యుమెంట్లు వెరిఫై చేసి రెన్యువల్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రుల రెన్యువల్ అంశంపై డీఎంహెచ్‌ఓ సాంబశివరావును ఫోన్‌లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయం
ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో
హాస్పిటల్స్‌కు ‘రెన్యువల్’ కష్టాలు
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో
40కిపైగా పెండింగ్ దరఖాస్తులు
ఫలితంగా రోగులు, ఆస్పత్రులు,
వైద్యులకు తప్పని తిప్పలు
చికిత్స తీసుకున్నవారికి వర్తించని బీమా, సీఎం సహాయనిధి పథకం
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
దృష్టి సారిస్తేనే ప్రయోజనం


