● జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి
సంగెం: మత్తు పదార్థాలను అరికట్టడానికి సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మండలంలోని గవిచర్ల జెడ్పీహెచ్‌ఎస్, పీఎస్‌మోడల్ స్కూల్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మామునూరు ఏసీపీ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఈగల్ టీం ఇన్‌స్పెక్టర్ రాంవిజయ్‌కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసైతే వారి భవిష్యత్, కుటుంబాలు నాశ నం అవుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఎస్సై వంశీకృష్ణ, ఎంఈఓ నర్సింహాచార్యులు, సర్పంచ్ బాషిపాక సదయ్య, ఉపసర్పంచ్ సంపత్ పాల్గొన్నారు.
దురలవాట్లకు బానిసకావొద్దు..
దుగ్గొండి: యువత దురలవాట్లకు బానిసగా మారితే భవిష్యత్ లేకుండా పోతుందని హైదరాబాద్ నార్కోటిక్ డీఎస్పీ మధుమోహన్‌రెడ్డి అన్నారు. నాచినపల్లి, దుగ్గొండి ఉన్నత పాఠశాలలు, గిర్నిబావిలోని పూలే గురుకుల విద్యాలయాలలో విద్యార్థులకు డ్రగ్స్‌పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. యువత డ్రగ్స్‌కు అలవాటుపడితే కలిగే అనర్థాలను మొదట ఛాయాచిత్రాల ద్వారా వివరించారు. అనంతరం మధుమోహన్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దన్నారు. నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఎస్సై రావుల రణధీర్‌రెడ్డి, సర్పంచ్‌లు పెండ్యాల రాజు, కామిశెట్టి ప్రశాంత్, పెండ్లి వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు జ్యోతిలక్ష్మి, రామస్వామి, ఓదెల మల్లయ్య, సీసీ శోభారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థు తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.


