కాజీపేట రూరల్: ఈ నెల 15న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ వద్ద నిర్వహించనున్న నిరసనలో పాల్గొనాలని ఆహ్వానించేందుకు రైల్వే జేఏసీ హైదరాబాద్ తరలింది. కాజీపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాపై మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు మంగళవారం రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ తెలిపారు. మంగళవారం కరపత్రాలు తీసుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంను, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావును, అరుణోదయ సంస్కృతి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కను, ఎన్‌ఎఫ్‌ఐఆర్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ సెక్రటరి ఎం.రాఘవయ్యను, సంఘ్ ఏజీఎస్ భరణి భానుప్రసాద్, ఎజీఎస్ రుద్రారెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ ప్రభురాజ్, ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ, రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, ఏజీఎస్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్, ప్రెసిడెంట్ ఖాజాపాషా, ట్రెజరర్ నర్సింహారెడ్డిని కలిసి కరపత్రాలు అందించి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, బృందం పాక వేదప్రకాశ్, వస్కుల రవీందర్, బి.మాధవరావు, వాయిల్ల తిరుపతి, పి.రమేశ్, కె.సాయిరాజ్, అనుముల శ్రీనివాస్, డి.రవీందర్, ఎం.రాజయ్య, భూ నిర్వాసితులు ఇలాసాగరం ప్రదీప్, కాయిత కుమార్ పాల్గొన్నారు.
‘హెచ్‌పీవీ’తో
క్యాన్సర్ నివారణ
ఎంజీఎం: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌తో బాలికల్లో గర్భస్థ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా నివారించగలమని హెచ్‌పీవీ వాక్సిన్ జిల్లా పర్యవేక్షణాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాశ్ అన్నారు. మంగళవారం ఎంజీఎంలో ఆర్‌ఎంఓ మధుకర్‌తో కలిసి అయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఒక్కపూట పారిశుద్ధ్య
విధానాన్ని అమలు చేయాలి
వరంగల్ అర్బన్: వేసవిలో ఎండలు మండుతున్నాయని, పారిశుద్ధ్య కార్మికులకు ఒకపూట పనులు కల్పించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు కోరారు. ఈ మేరకు బల్దియా ప్రధాన కార్యాలయంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేష్‌ను మంగళవారం కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ధర్మరాజు, జన్ను ప్రకాష్, ఆర్.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే మహిళల
అభివృద్ధి సాధ్యం
కేయూ క్యాంపస్: విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలోని బీసీ సెల్ ఆధ్వర్యంలో కేయూ దూరవిద్యా కేంద్రం ప్రాంగణంలో మంగళశారం నిర్వహించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, బీసీసెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీష్, కేయూ పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేశ్‌లాల్, డాక్టర్ రమ, డాక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


