హాల్‌మార్క్‌ లేని నగలు కొనొద్దు | - | Sakshi
Sakshi News home page

హాల్‌మార్క్‌ లేని నగలు కొనొద్దు

Mar 11 2026 9:19 AM | Updated on Mar 11 2026 9:19 AM

బీఐఎస్‌ స్టేట్‌ డైరెక్టర్‌ అభిసాయి

నర్సంపేట: బీఐఎస్‌ కేర్‌ యాప్‌ బంగారు నగలపై ప్రభుత్వం హాల్‌మార్క్‌ ముద్రణ తప్పనిసరి చేసిందని బీఐఎస్‌ స్టేట్‌ డైరెక్టర్‌ అభిసాయి అన్నారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో బంగారు నగల నాణ్యతా ప్రమాణాలపై మంగళవారం జిల్లా అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్‌ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిసాయి మాట్లాడుతూ నిబంధనలు పాటించని వ్యాపారులకు రూ.5 లక్షల వరకు జరిమానా, ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. హాల్‌మార్క్‌ లేకుండా బంగారు, వెండి నగలు అమ్మరాదని, కొనరాదని పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఏఐ ట్రేడ్‌ మార్క్‌ ఉన్న ఆహార వస్తువులు, పానీయాలను వాడాలని సూచించారు. స్టేట్‌ కన్జ్యూమర్‌ ఫోరం అధ్యక్షుడు శంకర్‌లాల్‌ మాట్లాడుతూ ట్రేడ్‌మార్క్‌ ఉన్న వస్తువులను కొని కల్తీ, నకిలీపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. మార్క్‌బ్రాండ్‌ ఉంటేనే పట్టువస్త్రాలను కొనాలని, వాటిని పరీక్షించదల్చుకుంటే దారాలను కొన్ని తీసి కాలిస్తే తల వెంట్రుకల వాసన వస్తుందని, మిగతావి బూడిద, ప్లాస్టిక్‌ వాసన వస్తాయని తెలిపారు. దేశంలో మల్బరీ పట్టు, తసర్‌ పట్టు, ఎరీ పట్టు, మగ పట్టు మాత్రమే ఒరిజినల్‌ అని, మిగిలినవి డూప్లికేట్‌గా గుర్తించాలని సూచించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మిరామానంద్‌ మాట్లాడుతూ బంగారం, పట్టు వస్త్రాలపై గురించి కన్జ్యూమర్‌ ఫోరం అవగాహన కల్పించడం గొప్ప విషయం అన్నారు. మున్సిపపల్‌ కమిషనర్‌ కాట భాస్కర్‌, ములుగు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్‌, ఉమ్మడి జిల్లా వినియోగదారుల మండల అధ్యక్షులు కె.దామోదర్‌, శ్రీనివాసరావు, వినియోగదారుల మండలి కార్యదర్శి ఈగ సత్యనారాయణ, కె.లక్ష్మయ్య, బెజ్జంకి ప్రభాకర్‌, బోయిని వెంకటస్వామి, అంగన్‌వాడీ టీచర్స్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, గుడి అరుణ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ రమాదేవి, డ్వాక్రా మహిళల నాయకురాలు మాధవి, ప్రతిభ కుట్టు శిక్షణ గిరిగాని స్వాతి, షరీఫా, శిరీష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement