సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయండి
శాయంపేట: సర్టిఫికెట్స్ త్వరగా జారీ చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి, సాదాబైనామా, జాతీయ రహదారులు, మీ సేవ సర్టిఫికెట్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు సంబంధించిన రికార్డులను ఆయన తనిఖీ చేశారు. మండలానికి సంబంధించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ ఎంత వరకు పూర్తయిందని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చెరువుల శిఖాల్లో వ్యర్థాలు పోయొద్దు..
మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ వ్యాపారులు చికెన్ వ్యర్థాలను చెరువుల శిఖాల్లో పోయకుండా, ఫౌల్ట్రీ ఫాం యాజమానులు చనిపోయిన కోళ్లను ఇష్టారీతిగా పడవేయకుండా తగిన చర్యలు చేపట్టేలా చూడాలని అధికారులకు ఆదేశాలు చేశారు. చికెన్ సెంటర్ వ్యాపారులు పెద్ద గుంతను తోడి వ్యర్థాలను వేయాలని, కుక్కలు తినకుండా చూసేలా చికెన్ సెంటర్ యజమానులకు నోటీలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పరకాల ఆర్డీఓ నారాయణ, ఎంపీడీఓ ఫణిచంద్ర, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
చికెన్ సెంటర్లకు నోటీసులు ఇవ్వండి
అదనపు కలెక్టర్ రవి


