సెటిలయ్యాకే వివాహం చేసుకోవాలి..
కలెక్టర్ స్నేహ శబరీష్
హసన్‌పర్తి: ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. 55వ డివిజన్ భీమారంలోని ప్రభుత్వ బాలికల గురుకుల కళాశాలలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నరసింహాహస్వామి, తహసీల్దార్ కిరణ్‌కుమార్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి సంపూర్ణ, ప్రియాంక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటర్ల సర్వే వేగవంతానికి చర్యలు
హన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఓటర్ల మ్యాపింగ్ సర్వే వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వెరిఫికేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, వెరిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు.


