డీసీపీకి ‘ఉత్కృష్ట’ పతకం అందజేత | - | Sakshi
Sakshi News home page

డీసీపీకి ‘ఉత్కృష్ట’ పతకం అందజేత

Feb 5 2026 7:10 AM | Updated on Feb 5 2026 7:10 AM

డీసీపీకి ‘ఉత్కృష్ట’  పతకం అందజేత

డీసీపీకి ‘ఉత్కృష్ట’ పతకం అందజేత

డీసీపీకి ‘ఉత్కృష్ట’ పతకం అందజేత

వరంగల్‌ క్రైం: పోలీస్‌ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు ఉత్కృష్ట పతకాన్ని అందజేసింది. ఈమేరకు బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు పతకాన్ని అందించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చే అధికారులకు శాఖాపరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందన్నారు. 2010 డీఎస్పీగా పోలీస్‌ శాఖలో చేరిన రాజమండ్రి నాయక్‌ నెల్లూరు జిల్లాతో పాటు వరంగల్‌ సీసీఎస్‌, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో డీఎస్పీగా పని చేసి 2017 అదనపు ఎస్పీగా భూపాలపల్లి, ఇంటెలిజెన్‌న్స్‌లో పనిచేసి, 2021లో ఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఎన్నో కీలక కేసులను పరిష్కరించడం డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌ కీలకంగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement