ముగిసిన నామినేషన్ల స్వీకరణ
నర్సంపేట/వర్ధన్నపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడానికి ఆయా పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. చివరి రోజు శుక్రవారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నర్సంపేటలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీజేపీ నుంచి గోగుల రాణాప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్‌పర్సన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో నాయకులు వారి కు టుంబాల్లోని మహిళలను బరిలో నిలుపుతున్నారు. నర్సంపేటలో 291 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్ భాస్కర్ తెలిపారు. వర్ధన్నపేటలో 121 నామినేషన్లు దాఖలయ్యాయి.
నర్సంపేటలో 291,
వర్ధన్నపేటలో 121 దాఖలు
ముగిసిన నామినేషన్ల స్వీకరణ


