కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు సాంకేతిక విద్య
నర్సంపేట రూరల్: విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక విద్యను ప్రవేశపెట్టాయని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని 14 పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండు రోజుల ఐసీటీ శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ సృజన్ తేజ, ఎంఈఓ కొర్ర సారయ్య, సరళ, చెన్నారావుపేట ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పాపమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక తరగతులను
సద్వినియోగం చేసుకోవాలి..
గీసుకొండ: వార్షిక పరీక్షల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను టెన్త్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. గీసుకొండ జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరిశీలించి ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు 45 రోజులపాటు టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. ఏఎంఓ సుజన్‌తేజ, హెచ్‌ఎం సుభాష్, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి
రంగయ్యనాయుడు


