అడ్మిషన్ల కోసం విస్తృత ప్రచారం
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల్లో (టెమ్రిస్) పిల్ల లను చేర్పించాలని కోరుతూ వరంగల్ రంగశాయిపేట శివారులోని జక్కలొద్ది గురుకులం సిబ్బంది నెక్కొండ మండలం తోపనపల్లి తదితర గ్రామాల్లో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డుమెంబర్ మహ్మద్ జానీ మియా చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయలు శివాజీ, రమేశ్, రాంకోటి, కౌన్సిలర్ సర్వర్‌మొహియొద్దీన్ ఘాజీ తదితరులు పాల్గొన్నారు.
న్యూశాయంపేట: జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్ 18004253424, 0870–2530812, 9154252936 నంబర్‌లో కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.


