ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన
● సమగ్ర శిక్ష తెలంగాణ
భవిత కేంద్రాల్లో సేవలు
కాళోజీ సెంటర్: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం 1986 జాతీయ విద్యావిధానం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా 1995లో దివ్యాంగుల చట్టాన్ని రూపొందించి 7 వైకల్యాలను గుర్తించారు. అంధత్వం, పాక్షిక దృష్టి లోపం, శారీరక వైకల్యం, కుష్ఠు వ్యాధి, వినికిడి లోపం, మానసిక దివ్యాంగులు, మానసిక రుగ్మత కలవారికి ఈ చట్టంలో హక్కులు కల్పించారు. అదేవిధంగా 3 శాతం రిజర్వేషన్లు ఉద్యోగాల్లో, 4 శాతం రిజర్వేషన్లు విద్యాసంస్థల్లో ప్రవేశానికి, 18 సంవత్సరాల వరకు వివక్ష లేని ఉచిత విద్య అందించడం వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో 14 వైకల్యాలను చేర్చుతూ మొత్తం 21 రకాల వైకల్యాలతో ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల హక్కుల సమావేశం యూఎన్‌సీఆర్‌పీడీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం–2016 రూపొందించింది. ప్రత్యేక అవసరాల పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థుల కోసం విలీన విద్యావిధానాన్ని కొనసాగిస్తోంది. జిల్లాల్లోని భవిత కేంద్రాల్లో పిల్లలకు అవసరమైన సేవలు అందించడానికి స్పెషల్ బీఈడీ, డీఈడీ అర్హత గల వారు విలీన విద్య రిసోర్స్‌పర్సన్లు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఉచితంగా ఉపకరణాలు..
భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు పలు రకాల సేవలు అందిస్తూ, ప్రధాన స్రవంతిలో తీసుకురావడానికి సమగ్ర శిక్ష తెలంగాణ కృషిచేస్తోంది. ప్రత్యేక విద్య, అవగాహన సదస్సులు, స్పీచ్ థెరపీ, ఇంటి వద్ద విద్య, ఆలింకో క్యాంపు ద్వారా అవసరమైన ఉపకరణాలు ఉచితంగా అందిస్తారు. చిన్న దిద్దుబాటు శస్త్రచికిత్సలు కూడా చేస్తారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు రవాణా చార్జీలతోపాటు వివిధ సేవలు అందిస్తున్నాం.
సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్
జిల్లా భవిత సెంటర్లు విద్యార్థులు
వరంగల్ 13 2,043
హనుమకొండ 14 1,810
భూపాలపల్లి 12 1,00
జనగామ 12 1,534
ములుగు 9 1,01
మహబూబాబాద్ 19 1,783
ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన


