అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– సత్యశారద, కలెక్టర్, వరంగల్
స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి
వరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్‌ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


