ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు
రాయపర్తి: ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పంటించి ధ్వంసం చేసిన సంఘటన బంధనపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో శివాజీ విగ్రహం ఆవిష్కరించకుండా ముసుగు కప్పి ఉంది. గమనించిన దుండగులు మంగళవారం రాత్రి విగ్రహానికి నిప్పంటించగా స్వల్పంగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ, వివిధ సంఘాల నాయకులు బుధవారం గ్రామానికి చేరుకుని దుండగులను గుర్తించి శిక్షించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు నూనె అనిల్, నాయకులు ఎనగందుల శ్రావణ్, బూరుగు నవీన్, నిమ్మల అనిల్, పెండ్యాల గణేశ్, గోరంట్ల ప్రభాకర్, మంచాల సుమన్, కొంగ అశోక్, కుమారస్వామితోపాటు బీఆర్‌ఎస్ మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, సర్పంచ్ అక్రినాయక్, నాయకులు కౌడగాని నర్సింగరావు, దీప్లానాయక్, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.


