విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
నర్సంపేట రూరల్: పోలీసులు విధుల్లో అలసత్వ వహిస్తే చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారి నుంచి ఫిర్యాదులను తీసుకుని, కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించారు. నిరంతరరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100 ఫోన్ రాగానే పోలీస్ స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట నెక్కొండ సీఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి, ఏఎస్సై లక్ష్మణ మూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


