
నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు
నెక్కొండ: ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పదని, ఉద్యోగంలో చేరిన నాడే విరమణ తేదీ ఉంటుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఎంఈఓ వీర రత్నమాల ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ మండలంలో 16 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎంఈఓగా రత్నమాల విధులు నిర్వర్తించారని తెలిపారు. ఉపాధ్యాయురాలిగా, ఎంఈఓగా ఆమె ప్రజల మన్ననలు చూరగొన్నారని ఆయన పేర్కొన్నారు. నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగులు సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు. అనంతరం రత్నమాల మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నెక్కొండ మండల పరిసర గ్రామాల్లోనే విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. ప్రజలు, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, మండల అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్‌సింగ్, యాకూబ్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి