
న్యాయ సేవల క్లినిక్‌లను వినియోగించుకోవాలి
వరంగల్ లీగల్: రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు న్యాయ సేవల క్లినిక్‌లను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్‌కోషి, న్యాయమూర్తి కె.లక్ష్మణ్‌తో కలిసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో న్యాయ సేవల క్లినిక్‌లను సైనిక్ వెల్ఫేర్ ఆఫీసుల్లో మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. హనుమకొండ వడ్డేపల్లిలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి హాజరైన వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, డాక్టర్ పట్టాభి రామారావు మాట్లాడుతూ న్యాయ సేవల క్లినిక్‌లో శిక్షణ పొందిన ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్లు ఇందిరా వైశాలి, వై.హనుకాంత్ సేవలందిస్తారని తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సత్యశ్రీ, న్యాయమూర్తులు, మాజీ సైనికులు, తదితరులు పాల్గొన్నారు.