
వృక్షరూప గణపయ్య
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ పరిధి గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్(కొత్త బీట్‌బజార్)లో ఈసారి పర్యావరణ హితం కోరే గణపతి విగ్రహాన్ని నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. వృక్షో రక్షతరక్షితః అనే విషయాన్ని ప్రచారంలోకి తేవడానికి స్థానిక వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. వినాయకుడి విగ్రహం తలపై భాగంలో వృక్షం ఆకృతితో పచ్చని చెట్టుకొమ్మలతో పాటు స్వామివారి కాళ్లకు ఏర్లు వేళ్లూనుకుని దర్శనమిస్తోంది. ఈ విగ్రహాన్ని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో శివ అనే వ్యక్తి పలువురు కార్మికుల సహకారంతో రూపొందించారని కాంప్లెక్ అధ్యక్షుడు తోట జగన్నాధం తెలిపారు.