పర్యావరణాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని కాపాడుకుందాం

Aug 27 2025 8:10 AM | Updated on Aug 27 2025 8:10 AM

పర్యా

పర్యావరణాన్ని కాపాడుకుందాం

నిట్‌ ఉన్నతిలో భాగస్వాములు కావాలి

న్యూశాయంపేట: మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ సత్యశారద పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండువేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, కాలుష్యనియంత్రణ మండలి ఈఈ సునిత, ఏఓ విశ్వప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌జీటీలకు

ఎస్‌ఏలుగా పదోన్నతి

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఎస్‌జీటీలకు స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ డీఈఓ వాసంతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 104 మంది ఎస్‌జీటీలు స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది పాఠశాలల్లో జాయిన్‌ అయ్యారు. ఆయా టీచర్లు విధుల్లో చేరేందుకు 15 రోజుల వరకు సమయం ఉంటుంది.

వరంగల్‌ జిల్లాలో సీనియారిటీ జాబితా..

వరంగల్‌ జిల్లాలో ఎస్‌జీటీలకు స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా తయారీలో కొంత ఆలస్యమైంది. ఇప్పటికే 1:3 సీనియారిటీ జాబితా వెల్లడించాక అభ్యంతరాలు స్వీకరించి మంగళవారం సాయంత్రం 1:1 నిష్పత్తిలో జాబితాను డీఈఓ రంగయ్యనాయుడు వెల్లడించారు. జిల్లాలో 82 మంది ఎస్‌జీటీలకు స్కూల్‌అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మంగళవారం రాత్రి 7–30 గంటల వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. వెబ్‌ ఆప్షన్ల తర్వాత పదోన్నతి ఉత్తర్వులు ఇస్తారు.

న్యాయసేవల క్లినిక్‌లను

సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్‌ లీగల్‌: రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు న్యాయ సేవల క్లినిక్‌లను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ అపరేష్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.సామ్‌కోషి, న్యాయమూర్తి కె.లక్ష్మణ్‌తో కలిసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో న్యాయ సేవల క్లినిక్‌లను సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసుల్లో మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. హనుమకొండ వడ్డేపల్లిలోని సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌ నుంచి హాజరైన వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, డాక్టర్‌ పట్టాభి రామారావు మాట్లాడుతూ న్యాయ సేవల క్లినిక్‌లో శిక్షణ పొందిన ప్యానల్‌ న్యాయవాది, పారా లీగల్‌ వలంటీర్లు ఇందిరా వైశాలి, వై.హనుకాంత్‌ సేవలందిస్తారని తెలిపారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్‌, క్షమాదేశ్‌ పాండే, సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సత్యశ్రీ, న్యాయమూర్తులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

పెండింగ్‌ ఉండొద్దు

రాయపర్తి: భూభారతి పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పూర్తిచేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి ఆదేశించారు. మంగళవారం మండలకేంద్రంలోని రెవెన్యూ కార్యాలయాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి పెండింగ్‌ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌ ముల్కనూరి శ్రీని వాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ ఐ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా విద్యార్థులు నిలవాలని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. నిట్‌లో ప్రవే శం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థుల కు, వారి తల్లిదండ్రులకు నిట్‌ వరంగల్‌ ఆడిటోరియంలో మంగళవారం ఓరియంటేషన్‌ ప్రో గ్రాం ఏర్పాటు చేశారు. నిట్‌ డైరెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ‘సాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్‌ వరంగల్‌కు స్వాగ తం’ అంటూ విద్యార్థులను ఆహ్వానించారు.

పర్యావరణాన్ని  కాపాడుకుందాం1
1/2

పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని  కాపాడుకుందాం2
2/2

పర్యావరణాన్ని కాపాడుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement