
హామీలు అమలుచేయాలి
● ఉద్యమకారుల పోస్టుకార్డు ఉద్యమం
రాయపర్తి: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని పోస్టాఫీస్‌లో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చిన ఎన్నికల మేని ఫెస్టోను అమలు చేయాలని రాహుల్‌గాంధీకి పోస్టు కార్డులు పంపారు. ఉద్యమకారులకు ఇంటిస్థలం, 25వేల పెన్షన్, పదివేల కోట్లతో సంక్షేమనిధి ఏర్పాటు, ప్రజాపథకాలలో 20శాతం వాటా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎనగందుల శ్యామ్‌సుందర్, రెడ్డి సంధ్యారెడ్డి, పూలమ్మ, చల్ల వెంకన్న, కౌడగాని రాజీరు, సుదగాని వెంకటేశ్వర్లు, తాళ్ల మల్లయ్య, కొత్త సంపత్‌రెడ్డి, జలగం రమేశ్, అన్నపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.